చీర కట్టులో సెగలు పుట్టిస్తున్న అనుపమ..!!

-

టాలీవుడ్ లోకి కేరళ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరనన్. ఈమెకు అందం ఈమె కళ్ళు, ఈమె జుట్టు అని చెప్పవచ్చు. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులకు అచ్చ తెలుగు అమ్మాయిల కూడా పేరు సంపాదించింది. అనుపమ తెలుగులోనే కాకుండా తమిళ్ ,మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా కనిపిస్తోంది. మొదటిసారి మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

ఇక తర్వాత నితిన్ నటించిన “అఆ” సినిమాతో నాగవల్లి అనే పాత్రలో నటించింది.దీంతో ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. అతి తక్కువ సమయంలోనే యంగ్ హీరోయిన్ల మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనుపమ. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గానే ఉంటూ ఏదో ఒక వీడియోను ఫన్నీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. ఇప్పుడు తాజాగా చీరకట్టులో కనిపిస్తూ చీరకే అందాన్ని తెచ్చేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.దీంతో కుర్రాళ్ళు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చీర కట్టులో అందంగా కనిపించడమే కాకుండా అనుపమ ముక్కుపుడక కూడా ఈమె అందాన్ని పెంచేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా కుర్రకారుల హృదయాలను గాయం చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక అభిమాని ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్కసారి చంపేసే బదులు ఒకేసారి విషం ఇచ్చి చంపేయొచ్చు కదా బుజ్జమ్మ అంటూ అనుపమను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news