కొబ్బరినీళ్లు తాగిన కొన్ని గంటలకే చనిపోయిన వ్యక్తి..

-

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు.. ఏ సీజన్‌లో అయినా ఇవి అందుబాటులోనే ఉంటాయి.. కానీ కొబ్బరినీళ్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏంటి కొబ్బరి నీళ్లు తాగి చనిపోవడం అని ఆశ్యర్యంగా ఉందా..? అవును కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.!!
డెన్మార్ దేశానికి చెందిన 69 ఏళ్ల ఏసీ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న కొబ్బరి నీళ్లను తాగాడు. కొంతసేపటికే అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఏసీ కొన్ని రోజుల క్రితం సూపర్ మార్కెట్ నుంచి ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తెచ్చుకున్నాడు. ఈ కొబ్బరి నీళ్లను కూడా బోండాంలోనే ఇచ్చారు. అయితే దీనిని రీఫ్రిజరేటర్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఈ వ్యక్తికి తెలియక దీనిని మామూలు కొబ్బరిబోండాం లాగే వంటగదిలో ఒక మూలన పెట్టాడు..
అలా రెండు మూడు వారాలు గడిచాయి. ఇటీవల మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొబ్బరినీళ్లు తాగుదామని అతడు దాచుకున్న కొబ్బరిబోండాం తీసి స్ట్రా వేసి తాగాడు. అయితే ఆ నీళ్లు చాలా చెడుగా, కుళ్లిపోయిన రుచితో ఉన్నాయి.. వెంటనే నోటిని పుక్కిలించి నోరు శుభ్రం చేసుకున్నాడు.. అయినా కొంత నీరు అప్పటికే అతడి కడుపులోకి వెళ్లిపోయింది. అతడు ఆ కొబ్బరిబోండాంను కట్‌ చేసి చూడగా అది పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టింది.
అవే నీటిని తెలియకుండా ఈ వ్యక్తి కొంత తాగేశాడు. వెంటనే ఏసీ తన భార్యను పిలిపించి తాను తాగిన కొబ్బరిబోండాంను చూపించాడు. ఆ కొబ్బరిబోండాంను రిఫ్రిజిరేటర్‌లో 4°C-5°C నిల్వ చేయాలని ఉంది. బయట పెట్టడంతో అది కుళ్లిపోయింది. ఈ కొబ్బరి నీళ్లు తాగిన మూడు గంటల తర్వాత ఏసీలో వింత లక్షణాలు కనిపించాయి. అతడికి తీవ్రంగా చెమటలు పట్టడం, వికారం, వాంతులు మొదలయ్యాయి.
కొద్ది క్షణాల్లోనే అతడు స్పృహ కోల్పోయి పడిపోయాడు. అతడి భార్య వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయినప్పటికీ రెండు గంటల తర్వాత పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, చివరకు బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

కారణం ఇదే

 ఏసి కుళ్లిపోయిన కొబ్బరి నీళ్లు తాగారు. సాధారణంగా మురుగు నీటిలో వృద్ధి చెందే ఆర్థ్రినియం సచ్చరికోలా (c) అనే ఫంగస్ ఆ కొబ్బరి నీళ్లలో వృద్ధి చెందింది. అలాగే కుళ్లిపోయిన ఆహారంలో 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ అనే టాక్సిన్ తయారవుతుంది. ఇలాంటి నీరు తాగడం వల్లనే అతడి శరీరం పూర్తిగా విష ప్రభావానికి గురయింది. మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయినట్లు పోస్ట్ మార్టమ్‌లో తేలింది.
నిజానికి కొబ్బరినీళ్లు ఫ్రష్‌గానే తాగాలి.. అవి నిల్వ చేస్తే ఒకరకమైన వాసన వస్తుంది. మనం బయట కొబ్బరినీళ్లను లీటర్‌ బాటిల్స్‌లో తెచ్చుకుంటాం..అవి కూడా అప్పుడే రెండు మూడు గంటల లోపే తాగాలి..వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తాగుదాం అనుకుంటారు.. అది తప్పే.! కొబ్బరి నీళ్లు ఎంత మంచివే.. వాటిని నిల్వ చేసి తాగితే అంత ప్రాణాంతకం అవుతాయి

Read more RELATED
Recommended to you

Latest news