65 లక్షల మందికి రైతుబంధు ఇవ్వబోతున్నాం – నిరంజన్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం రైతు బంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి.

ఇందుకోసం గాను రూ. 7,600 కోట్ల‌ను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుండగా, మొత్తంగా 65 లక్షల మందికి సాయం అందుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమన్న ఆయన, ప్రస్తుతం రైతుల ఖాతాల్లో వేయనున్న రూ. 7600 కోట్లతో కలిపి ఇప్పటివరకు రూ. 66 వేలకోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసిందన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న మొట్టమొదటి పథకం దేశంలో ఇదేనని నిరంజన్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news