పవర్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంటగా కనిపిస్తే అభిమానులకు పండగే. ఇక వీళ్లిద్దరూ కలిసి మీడియా కంట పడితే కెమెరా క్లిక్ మనాల్సిందే. ఈ జంటకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే అనుష్క, విరాట్ లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టగానే క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అనుష్క పోస్టు చేసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తాజాగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటగా దిగిన ఫొటోలను అనుష్క సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. బ్లాక్ సూట్ లో విరాట్ డ్యాషింగ్ లుక్ లో కనిపించగా.. అనుష్క పర్పుల్ కలర్ బాడీఫిట్ డ్రెస్సులో అదిరిపోయింది. ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపించారు.
ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్ ట్రెండ్ అవుతున్నాయి. విరుష్క జంట ఎప్పటిలాగే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అనుష్క కంటే విరాట్ యంగ్ గా కనిపిస్తున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వెస్టర్న్ డ్రెస్సు ధరించినా అనుష్క కాళ్లకు పట్టీలు ధరించి కాస్త ట్రెడిషనల్ లుక్ యాడ్ చేసిందంటూ పొగుడుతున్నారు.