కరోనాకు వీరుష్క భారీ సాయం…? ఎంత చేస్తారు…?

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రజలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇక ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకి వచ్చి తమ వంతుగా సాయం చేస్తున్నారు. భారీ సాయం చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు సహాయం చేయడానికి ముందుకి వస్తున్నారు. టీం ఇండియా ఆటగాళ్ళు ఇప్పటి వరకు ముందుకి వచ్చి సాయం చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు ముందుకి వస్తున్నారు అందరూ.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ రూ. 50 లక్షలు, సురేశ్‌ రైనా రూ. 52 లక్షలు సాయం చేసారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా 50 కోట్ల రూపాయల సహాయం చేసింది. తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ముందుకి వచ్చారు. ‘‘వారి బాధను చూస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. మేము చేసే సాయం తోటి పౌరులకు బాధ నుంచి విముక్తి కల్పిస్తుందని ఆశిస్తున్నాం.

పీఎం కేర్స్‌ ఫండ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాలని నేను అనుష్క నిర్ణయించుకున్నామని అతను పోస్ట్ చేసాడు. ఎంత సహాయం చేసేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రాకుండా తాము ఇంట్లో ఉండి ఎం చేస్తున్నామో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సూచనలను చేస్తూ సమయం గడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version