సూపర్ స్టార్ మహేష్ బాబు తో డైరెక్టర్ పరశురామ్. ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తీసి హిట్టు కొట్టిన తెలిసిందే. చాలా మంది ఈ సినిమా మహేశ్ బాబు రేంజ్ హీట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.ఇవన్నీ మరచి పోయి పరశురామ్మళ్లీ స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. తాను తయారు చేసిన కథలను చాలా మందికి వినిపించాడట కాని ఇంకా ఎవరినుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట.
SVP సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అయ్యింది. కాని పరశురాం తర్వాత సినిమా ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తానునాగచైతన్యతో ఓ సినిమా చేయాల్సి వుంది అని పరశురాం చెబుతూ వచ్చారు. ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండే అవకాశం వుందని సమాచారం.కానీ ఇంతవరకూ దీనిపై స్పష్టత రాలేదు.నిజానికి సర్కారు వారి పాట కంటే ముందే నాగచైతన్య తో పరశురాం సినిమా చేయాల్సింది. కాని పరశురాం మహేష్ బాబు సినిమా కోసం కమిట్ అయ్యాడు.
అయితే ఇప్పుడైనా నాగచైతన్య తన తర్వాతి చిత్రాన్ని పరశురాంతోనే చేస్తారని భావిస్తుండగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని విరమించుకోవాలని చైతూ నిర్ణయించుకున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహేశ్ తో సినిమా తర్వాత చాలా మంది హీరోలు పరుశురాంకు డేట్స్ ఇవ్వలేదట. అలాగే ఇప్పుడు ఒప్పుకున్న చైతూ – పరశురాం ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా అని అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. అలానే పరశురాం తర్వాత సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.