కరోనా, థర్డ్ వేవ్ ప్రభావంతో దేశంలో అన్ని రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను, నైట్ కర్ఫ్యూలను విధించాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు సాధ్యమైనంత ఎక్కువగా ప్రభుత్వాాలు ప్రయత్నించాయి. తాజాగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క రాష్ట్రం నెమ్మదిగా కరోనా ఆంక్షలను ఎత్తేస్తున్నాయి.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రజలు మాస్కులను తప్పకుండా ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ప్రజలు మాస్క్ లేకుండా కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి 25 వేల వరకు ఫెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. తీవ్రతను బట్టి జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కెట్లు, వాణిజ్య సముదాయాల వద్ద కరోనా రూల్స్ పాటించకుంటే తీవ్రతను బట్టి షాపులను ఒకటి లేదా రెండు రోజులు మూసివేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 28 ఫిబ్రవరి 2022 వరకు అమలులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోన కేసుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేసింది.