నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్లో శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసన సభ వ్యవహారాల కమిటి సమావేశం జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీని ఎన్ని రోజులు నడపాలి, ఏఏ అంశాలపై ప్రధానంగా చర్చించాలనే విషయాలపై చర్చ జరగనుంది. అనంతరం 9.15 గంటలకు శాసన సభ, 9.45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభమైన వెంటనే మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ శాసనసభ లో చర్చ అంశాలు

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపకరవేతనాలు

మాచర్లనియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి.

పి హెచ్ సి ..పి హెచ్ సి వైద్య&సాంకేతిక సిబ్బంది నియామకం.

చిత్తూరు జిల్లలో రైతుల కు చెందిన ట్రాన్స్ఫార్మర్స్ ల చోరీ.

రాష్ట్రంలో కాల్వల శిథిలావస్థ

రాష్ట్రంలో విశ్వ బ్రహ్మాణ రుణాలు.

రాష్ట్రంలో మున్సిపాలిటీలల్లో భూగర్భ మురుగు పారుదల పనులు .

రౌతులపూడి మండలం లో పోలీస్టేషన్ ఏర్పాటు.

ఉండి నియోజకవర్గంలో ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు.

మహేంద్రతనయ నదిలో కాలుష్యం.

శాసన మండలి లో చర్చ అంశాలు

వివిధ పంటలకు మద్దతు ధర.

రైతులకు నాణ్యమైన విత్తనాలు.

బి పి ఎల్ కార్డు దారులు

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల

తెలుగు భాష పునరుద్ధరణ.

ప్రవేట్ పరిశ్రమ ల స్థాపన.

చేపల ఉత్పత్తి నిషేధం.

పసుగణభివృద్ధి సంస్థ.

టీటిటిడి ఆధ్వర్యంలో విద్యా సంస్థలు.

బాషా పండిట్ లు,పిఈటీలకు స్కూల్ అసిస్టెంట్ హోదా పెంపు.

Read more RELATED
Recommended to you

Latest news