విజయ్ నోటా స్నీక్ పీక్.. ఏమున్నాడండి..!

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న సినిమా నోటా. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ పొలిటిషియన్ గా కనిపిస్తాడట. ఇక ఈ సినిమా నుండి స్నీక్ పీక్ అంటూ ఓ 30 సెకన్స్ వీడియో వదిలారు. ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు వస్తుందని చెబుతూ ఈ వీడియో వదిలారు.

ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా విజయ్ మార్క్ చూపించేలా నోటాలో కూడా ఓ లిప్ లాక్ పెట్టేశారు. ఆనంద్ శంకర్ సినిమాలంటే తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ ఏర్పడ్డాయి. మరి విజయ్ తో ఆనంద్ శంకర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. రాజకీయ నేపథ్యంతో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా అందరికి రీచ్ అవడం ఖాయమని అంటున్నారు.

ఈమధ్యనే వచ్చిన గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నోటా అంటూ మరో సెన్సేషనల్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ సరసన మెహెరీన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news