క‌డ‌ప ఉక్కుకు క‌ట్టుబ‌డి ఉన్నాం : క‌న్నా

-

AP BJP President Kanna LaxmiNarayana Fires On CM Chandrababu

అమ‌రావ‌తి(కడప): కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అందులో వచ్చే కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు ఆరాట పడుతున్నారని ఆయన ఆరోపించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. రాయలసీమలో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు రాలేదనే కోపంతోనే ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కన్నా విమర్శించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం, ప్రొద్దుటూరు, చిత్తూరు పాలడైరీలనను వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news