ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం వచ్చే సంవత్సరం మార్చ్ 4 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయి 21 తో ముగుస్తుండగా , ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారభం అయి 23 న ముగుస్తాయి.. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూలు వర్తించనుంది. వెల్లడించిన తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక తెలంగాణా ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే కావడం విశేషం.. ఇక ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 28న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 30న నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది.