ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. 2021–22 రాష్ట్ర బడెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లుగా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా రూ. 2,24,789.18 కోట్లని ఆయన వివరించారు. ఎవరెవరికి ఎంతెంత? కేటాయింపు చేసింది ఆయన సభలో చదివి వినిపించారు. 2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు, బడ్జెట్‌లో రూ. 28,237 కోట్లు అని చెప్పారు. ( 2020–21లో రూ.21,317.24 కోట్లు)గా చెప్పారు.
ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు, బడ్జెట్ రూ.5,478కోట్లుగా ఉంది. (2020–21లో రూ.5,088.55 కోట్లు) కాపు సంక్షేమంకోసం 7 శాతం అధిక కేటాయింపులు, 3,306 కోట్లు, (2020–21లో రూ.3,090 కోట్లు), బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు, రూ.359 కోట్లు, (2020–21లో రూ.124 కోట్లు), ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 22 శాతం అధిక కేటాయింపులు, రూ. 17403 కోట్లు, (2020–21లో రూ. 14,218కోట్లు), ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 27శాతం అధిక కేటాయింపులు, రూ. 6,131కోట్లు, (2020–21లో రూ.4,814 కోట్లు) కేటాయించామన్నారు.