బ్రేకింగ్; ఏపీ బడ్జెట్ సమావేశాలు క్యాన్సిల్…!

-

ఒక పక్క దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికలను, పార్లమెంట్ సమావేశాలను అన్నింటిని వాయిదా వేసారు. పరిస్థితి బాగా లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. పది మంది మనుషులు గుమిగూడే ప్రతీ అవకాశాన్ని రద్దు చేసారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజకీయ పక్షాలు, అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు, అధికారులు ఇలా అందరూ కూడా బడ్జెట్ సమావేశాలు వద్దని చెప్తున్నారు, బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోలీసులులు ఇలా ఎందరో రావాల్సి ఉంటుంది. వారిలో ఒక్కరికి వ్యాధి ఉన్నా సరే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఈ నేపధ్యంలో రాష్ట్ర బడ్జెట్ ని ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముందు వోట్ ఆన్ ఎకౌంటు ద్వారా బడ్జెట్ ని ప్రవేశ పెట్టాలని చూసినా అది సాధ్యం కాలేదు. దీనితో ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ని ప్రవేశ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 2004లో ఉమ్మడి ఏపీ సిఎం గా ఉన్న చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు ఒకసారి ఇలాగే ప్రవేశ పెట్టారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించినపుడు ఆర్డినెన్స్‌ ద్వారానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news