ఏపీప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు..

-

ఏపీలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5646 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,50,563కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 50 చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,319 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,72,281 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 1,00,001 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,11,50,847 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news