ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : తెలంగాణ బోర్డర్ వద్ద ఆంక్షలు పూర్తిగా తొలగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ-తెలంగాణ బోర్డర్ వద్ద ఆంక్షలు పూర్తిగా తొలగింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆంక్షలు ఎత్తివేయడంతో ఏపీ వాసులకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి పాస్ లు లేకపోయినా పోలీసులు అనుమతిస్తున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న వేళ మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వివాదాస్పదమైంది. తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. తెలంగాణ పోలీసులు మాత్రం అంబులెన్సులను అడ్డుకున్నారు.

అయితే.. తాజాగా తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ఏపీ వాసులకు ఇక్కట్లు తప్పనున్నాయి. కాగా లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.