ఏపీ సిఎస్ రాజీనామా…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలజడికి కారణం అయ్యాయి. ప్రభుత్వంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్నికలను వాయిదా వేయడంపై ఇప్పుడు అధికార పార్టీ సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ గా ఉన్న నేపధ్యంలో అటు మంత్రులు కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె ఎన్నికల సంఘానికి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తో లేఖ రాయడంపై ఇప్పుడు కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో ఆమె ఆ పదవి నుంచి తప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆమెపై కోర్ట్ ల ఒత్తిడి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇక ప్రభుత్వంలో వద్దని,

తప్పుకుంటే మంచిది అనే భావనలో ఆమె ఉన్నారు. ఇప్పటికే ఆమె తన సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసారని అంటున్నారు. ఒత్తిడి భరించలేని పరిస్థితుల్లో ఉన్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా నీలం సహాని విషయంలో కొందరు అధికారుల పెత్తనం ఎక్కువైంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనితోనే ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news