రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న సీఎం జగన్, రేపు సాయంత్రం డైరెక్ట్ గా వెళ్లి అమిత్ షా ను కలవనున్నారు. సీఎం జగన్ అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నట్టు చెబుతున్నారు. ఎల్లుండి ఢిల్లీ నుంచే తిరుమల వెళ్లనున్నారు సీఎం జగన్.

తాజా హిందూ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ఆకస్మిక పర్యటనకు కారణం మాత్రం తెలియ లేదు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్స్ ని వైసీపీ మద్దతు ఇస్తోంది కూడా.