కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య కొంచం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకింత శుభమే అయినా.. రానున్న రోజుల్లో ఇది ఎలా మారుతుందో అర్ధం కావట్లేదు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,496కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కోవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 92 మందికి చేరింది.
ఏపీలో కోరలు చాచిన కరోనా.. ఇవాళ ఒక్కరోజే..!
-