మన దేశం లో ఆడవాళ్లపై రోజురోజుకి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయ్. చిన్నారులు కూడా ఎంతోమంది రాక్షసులకు బాలి అవుతున్నారు. అయితే, కొన్ని కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి. ఏపీ లో ముఖ్యంగా దిశా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈ కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు . ఇక, 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వచ్చింది. చిన్నారిపై అఘాయిత్యం కేసులో.. నిందితుడు సూరిబాబుకి 20 ఏళ్ల జైలు శిక్ష , 10 వేల రూపాయలు జరిమానా విధించింది కోర్టు.
అల్లూరి జిల్లా లోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అభంశుభం తెలియని ఒక 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు సూరిబాబు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, విచారణ జరిపిన విశాఖ ఫోక్సో కోర్టు.. నిందితుడిని దోషిగా ప్రకటించింది. ఇక, ఏడాది గడవక ముందే కేసులో తీర్పు వెలువరించింది.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు విశాఖ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి.. దీంతో.. న్యాయమూర్తి ఆనందికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.