ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా బారినపడ్డారు. కడప జిల్లాలో ఆయన కుటుంబానికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎంతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కరోనా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం వారు తిరుపతిలోని స్విమ్స్ లో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిన్న వీరు స్విమ్స్ నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్టు వైద్యాధికారులు తెలిపారు.
ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.