ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్… తేడా వస్తే తాట తీస్తాం…!

-

రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశాం అని ఆయన అన్నారు.

ap dgp gotam savang
ap dgp gotam savang

దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్న డిజిపి రాష్ట్రం లోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద అన్ని భద్రత చర్యలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షించలని జిల్లా ఎస్పీ లను ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశాం అని పేర్కొన్నారు. మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అట్టి వారి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదనీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news