పొలిటికల్ ఎజెండాతోనే వివాదాల్లోకి పోలీసులు !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి పోలీసులు వర్సెస్ టీడీపీ అన్నట్టు నడుస్తోంది. ఏపీలో ఎటువంటి ఇబ్బందికర ఘటన జరిగినా దానిని ఎత్తి చూపుతూ చంద్రబాబు బహిరంగ లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. ఇప్పటికే ఈ లేఖల గురించి చాలా మంది పోలీసు అధికారులు స్పందించగా ఇప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖల మీద స్పందించారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే అవాస్తవాలతో నాకు లెటర్స్ రాస్తున్నారని డీజీపీ అన్నారు.

అది మేము విచారణ జరిపితే అవాస్తవమని తెలుతోందని అన్నారు. పొలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి లాగుతున్నరన్న ఆయన ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకున్నామని అన్నారు. సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోందని, ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్ కి రాకుండానే సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకునే విధంగా అప్డేట్ అయ్యామని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న అయన శాంతి భద్రతలకు విఘాతం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news