అమ్మాయిలకు సువర్ణ అవకాశం… దరఖాస్తు కొరకు వెంటనే అప్లై చేసుకోండి..!

-

అమ్మాయిలకు శుభవార్త. చదువులో ఆర్ధికంగా వెనుకబడి, మంచి నైపుణ్యం గల విద్యార్థినిలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- డీఆర్‌డీఓ ఒక మంచి వార్త అందించింది.. డీఆర్‌డీఓ ప్రతి సంవత్సరం రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా స్కాలర్‍షిప్స్‌ ను ప్రకటించింది. అయితే ఈ స్కాలర్‍షిప్స్‌ కు సంబందించిన దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30న ముగిసింది. అయితే కరోనా వైరస్ కారణంగా స్కాలర్‍షిప్స్‌ కు అప్లై చేయలేని విద్యార్థినిలకు మరో అవకాశం ఇచ్చింది డీఆర్‌డీఓ. ఈ దరఖాస్తు గడువును 2020 నవంబర్ 15 వరకు పొడిగించింది. అంటే మరో 45 రోజులు పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. కాబట్టి ఇప్పటివరకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ కు అప్లై చేయలేని విద్యార్థినులకు మరో నెల రోజులు పాటు అవకాశం ఉంది. అయితే ఈ స్కీమ్ ద్వారా 20 అండర్ గ్రాడ్యుయేట్, 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది డీఆర్‌డీఓ.

డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ స్కీమ్ పొందాలంటే కచ్చితంగా భారతదేశానికి చెందిన అమ్మాయి అయి ఉండాలి. భారత దేశ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్కాలర్‌షిప్ పొందడానికి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు దరఖాస్తు చేయాలి. ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి అర్హతలు విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్‌ లో కనీసం 60% మార్కులు ఉండాలి. అలాగే JEE (మెయిన్) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వారికి ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇక పీజీ స్కాలర్‌షిప్ కోసం ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు దరఖాస్తు చేయాలి. వారికి రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది. 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అడ్మిషన్ పొందినవారే స్కాలర్‌షిప్‌కు అప్లై చేయడానికి అర్హులు.

ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో https://drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు. విద్యార్థినులు రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC వెబ్‌సైట్ https://rac.gov.in/ లో అప్లై చేయాలి. డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ ద్వారా విద్యాభ్యాసం చేసే విద్యార్థినుకులు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌ కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ అయి ఉండాలి.. ఈ అవకాశాన్ని విద్యార్థినిలు ఉపయోగించుకోవాలనే మరొకసారి గడువుని పొడిగించారు.

Read more RELATED
Recommended to you

Latest news