ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏపీలో అసలు ఉన్నత విద్య పరిస్థితి ఎలా ఉండనే అంశం తెలుసుకోవడానికి ఉన్నత విద్యామండలి ఇంటింటి సర్వే చేపట్టడానికి సిద్దం అయిందని అంటున్నారు. ఈ సర్వే కోసం పాఠశాల విద్యా శాఖలో క్లస్టర్ రిసోర్సు పర్సన్లు(సీఆర్పీ), గ్రామ, వార్డు విద్య, సంక్షేమ సహాయకుల సేవలను వినియోగించుకోనుందని సమాచారం.
అసలు ఈ సర్వే ద్వారా ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారు ? ఆ ఉన్న వారు ఏం చదువుకున్నారు ? చదువు ఎందుకు ఆపేస్తున్నారు ? లాంటి అనేక వివరాలు సేకరిస్తారు. సర్వేపై మొదట సీఆర్పీలకు శిక్షణ ఇస్తారు. వీరు విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 19 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి కూడా సిద్దం అయినట్టు సమాచారం.