ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ గ్రామాలన్నీ మునిసిపాలిటీలే !

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా మారుస్తూ ప్రభుత్వం నిన్న రాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పురపాలక చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలు విలీనం కానున్నాయి. పాలకొల్లు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, కందుకూరు మున్సిపాలిటీల్లోకి సమీప గ్రామ పంచాయితీలు కూడా విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేశారు.

అమరావతి పరిధిలోని నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, చినకాకాని, ఆత్మకూరు, కాజా, నూతక్కి, చిన్న, పెద్ద వడ్లమూడి, రామచంద్రాపురం మొత్తం 11 గ్రామాలు మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు. అలానే తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, వడ్డేశ్వరం, కుంచంపల్లి, కొలనుకొండ, తదితర ప్రాంతాలను విలీనం చేశారు. అలానే విజయవాడ రూరల్ పరిధిలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమల కుదురు తదితర ప్రాంతాలను కలుపుతూ వైఎస్సాఆర్ తాడిగడపగా మార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news