హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం.. చిక్కుల్లో అఖిలప్రియ !

హైద్రాబాద్ లో రాయలసీమ గ్యాంగ్ హల్చల్ చేసింది. బోయిన్పల్లి లో ప్రవీణ్ రావ్ అనే మాజీ హాకీ ప్లేయర్ అలానే ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు. కర్నూల్ జిల్ల్లా ఆళ్లగడ్డకు చెందిన మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పేరు తో ముగ్గురి కిడ్నాప్ కలకలం రేపింది. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు ఐటీ అధికారుల మంటూ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అనంతరం ల్యాండ్ పత్రాలతో పాటు , ల్యాప్ టాప్ లను ముగ్గురు వ్యక్తులని కిడ్నాప్ చేశారు దుండగులు.

హాఫిజ్పేట్ లో ఉన్న వందల కోట్ల విలువయిన లాండ్ కోసం గత కొంతకాలం గా గొడవ జరుగుతోంది. ఈ ముగ్గురూ కూడా సీఎం కేసీఆర్ పీఏ వేణు గోపాల్ బావలు అని తెలుస్తోంది. వీరంతా గతంలో భూమా నాగిరెడ్డి తో కలిసి వ్యాపారాలు చేసినట్టు సమాచారం. అయితే కిడ్నాప్ చేసిన దుండగులు వీరి చేత సంతకాలు పెట్టించుకుని వదిలి వేశారు. అయితే ఈ వ్యవహారంలో కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావు పేరు కూడా వినిపిస్తోంది. పోలీసులు ఏమి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.