ఏపీలో కౌలు రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. రైతు భరోసా నుంచి ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా రైతు భరోసా వర్తింస్తుందని జీవోలో పేర్కొంది.
ఒక వేళ రైతు మరణిస్తే భార్యకు రైతు భరోసా సాయం అందించనుంది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.