అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ గవర్నమెంట్..!

-

ఇది వరకే అన్ లాక్ 5.0 సంబంధించి మార్గదర్శకాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలో ఉన్న అనేక రకాల వ్యాపార కార్యకలాపాలు ఇది వరకు స్థాయికి రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అయ్యే అన్ లాక్ గైడ్ లైన్స్ ను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఆ గైడ్ లైన్స్ ఏంటో చూద్దామా…

ఇందులో మొదటగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. అలాగే ఏదైనా షాపింగ్ మాల్స్, వాణిజ్య ప్రదేశం, సినిమా హాల్స్ లాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా శానిటైజర్ ను ఏర్పాటు చేసి ఉండాలి. వీటితోపాటు ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. అలాగే ప్రజలు ప్రయాణ సమయాల్లో కూడా కోవిడ్19 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే సినిమా హాల్స్ అలాగే షాపింగ్ మాల్స్ కి ప్రవేశం ఉండదు.

ఇక ప్రతి ఊరిలోని రైల్వే స్టేషన్, అలాగే బస్ స్టాప్ లలో కచ్చితంగా మాస్కు ధరించడం కంపల్సరీ. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే కచ్చితంగా మాస్క్, శానిటైజర్ లాంటివి ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించే చోట కచ్చితంగా కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని తెలిపింది. వీటితో పాటు పాఠశాలలో అధ్యాపకులు, విద్యార్థులు ప్రతి పిరియడ్ తర్వాత కచ్చితంగా చేసుకోవాలని తెలిపింది. ఇక పోతే రాష్ట్రంలో ఇప్పటివరకు 7 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 6128 మంది ప్రాణాలు విడిచారు. ఇకపోతే ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ కొద్ది ప్రాంతాలకే పరిమితమైందని చాలా వరకు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు కేవలం 5 శాతం కన్నా తక్కువగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో రోజుకి 15 లక్షల నమూనాలను పరీక్షించే స్థాయికి చేరినట్లు అధికారులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news