దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట ప్రత్యేక సేల్‌లను నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. కాగా మొబైల్స్ తయారీదారు రియల్‌మి కూడా ఫెస్టివ్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగే తేదీల్లోనే రియల్ మి ఫెస్టివ్ డేస్ సేల్ కూడా జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు రియల్‌మి సేల్ కొనసాగుతుంది.
రియల్‌మి ఫెస్టివ్ డేస్ సేల్‌లో రియల్‌మి ఫోన్లతోపాటు రియల్‌కి చెందిన ఇతర ఉత్పత్తులను కూడా తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. రియల్‌మి వియరబుల్స్, ఆడియో యాక్ససరీలు, ఇతర ప్రొడక్ట్స్‌ను తగ్గింపు ధరలకు ఆ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ తదితర సదుపాయాలను పొందవచ్చు.
రియల్‌మి సేల్‌లో రియల్‌మి సి11 ఫోన్‌పై రూ.500 తగ్గింపు లభిస్తుంది. అలాగే రియల్‌మి సి12, సి15, రియల్‌మి 6 ఫోన్లపై రూ.1000, రియల్‌మి ఎక్స్3, ఎక్స్3 సూపర్ జూమ్ ఫోన్లపై రూ.3వేలు, రియల్‌మి ఎక్స్50 ప్రొ ఫోన్‌పై రూ.5000 వరకు డిస్కౌంట్ ఇస్తారు.
రియల్‌మి బడ్స్ ఎయిర్ ప్రొపై రూ.500, బడ్స్ ఎయిర్ నియోపై రూ.1వేయి, రియల్‌మి 32, 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై రూ.1వేయి చొప్పున, రియల్‌మి 55 ఇంచుల 4కె టీవీపై రూ.3వేలు, రియల్‌మి సెక్యూరిటీ క్యామ్ 360పై రూ.400, బడ్స్ క్యూపై రూ.500, స్మార్ట్‌వాచ్‌పై రూ.1వేయి, స్మార్ట్ బ్యాండ్‌పై రూ.500, 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌పై రూ.100 నుంచి రూ.300 వరకు, బడ్స్ 2.0పై రూ.100, బడ్స్ వైర్‌లెస్‌పై రూ.300, బడ్స్ వైర్‌లెస్ ప్రొపై రూ.1వేయి డిస్కౌంట్లను అందివ్వనున్నారు.