ఏపీలో ఇసుక ధ‌ర ఖ‌రారు… ట‌న్ను రేటు చూస్తే షాకే షాక్‌

-

ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కారు ఇసుక ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేసింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఇసుక ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించిన అధికారికంగా ప్ర‌క‌టించ‌డమే త‌రువాయిగా మిగిలింద‌ట‌. అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసింది ఏపీ స‌ర్కారు. ఏపీలో టీడీపీ అధికారంలో నుంచి దిగి వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే అనేక ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేస్తూ ముందుకు సాగుతుంది. టీడీపీ ఇసుక ఉద్య‌మం పేరుతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చినప్ప‌టికి ఇసుక రేట్ల‌ను అంత‌క‌న్నా ముందే ఖ‌రారు చేసిన‌ట్లు వినికిడి. అయితే ట‌న్ను ఇసుక‌ను కేవ‌లం రూ.375ల‌కే ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం విశేషం.

ఇది తెలంగాణ స‌ర్కారు ఇస్తున్న ధ‌ర క‌న్నా రూ.25లు త‌క్కువ‌కు నిర్ణ‌యించారు. ఈమేర‌కు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించిన ఏపీఎండీసీ, భూగ‌ర్భ గ‌నుల శాఖ ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింద‌ట‌. ఒక‌టి రెండు రోజుల్లో ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టిస్తూ అధికారికంగా ఉత్త‌ర్వులు ఇవ్వ‌నున్న‌ది ఏపీ స‌ర్కారు. ఏపీలో ఇసుక రాజ‌కీయం వాడీవేడీగా న‌డుస్తున్న‌ది. ముందే ఓ కోయిల కూసింద‌న్న‌ట్లుగా ప్ర‌తిప‌క్ష టీడీపీ అధికార ప‌క్షంపై ఇసుక దాడి చేయ‌డం మొద‌లు పెట్టింది. ఏపీ స‌ర్కారు ఇసుక మాఫీయా న‌డుపుతుంద‌ని టీడీపీ ధ్వ‌జ‌మెత్తుతూ ఏకంగా ఉద్య‌మాన్ని కూడా నిర్వ‌హించింది.

అయితే ఏపీ సీఎం జ‌గ‌న్ ఎంతో వ్యూహాత్మ‌కంగా టీడీపీని దెబ్బ కొట్టాడ‌నే అర్థం అయ్యేస‌రికి టీడీపీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఏపీ స‌ర్కారు గ‌త మూడు నాలుగు రోజుల ముందే ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించిద‌ట‌. అయితే ఈధ‌ర‌ల‌తో టీడీపీ ప‌రువు బ‌జారున ప‌డుతుంద‌ట‌ని ఇసుక నాట‌కానికి తెర‌లేపింద‌ట‌. అందుకే ఇసుక పేరుతో ఉద్య‌మిస్తే ఏపీ స‌ర్కారు నిర్ణ‌యించిన ధ‌ర‌లు ప్ర‌క‌టిస్తుంది.. అప్పుడు అది మా పోరాటం ఘ‌న‌తే అని టీడీపీ చెప్పుకోవ‌చ్చ‌నే ఎత్తుగ‌డ వేసింద‌ట. అందులో భాగంగానే ఇసుక పోరాటం డ్రామాన‌ట‌.

కానీ జ‌గ‌న్ ముందుగానే ప‌సిగ‌ట్టి టీడీపీ ఎత్తుల‌ను చిత్తు చేస్తూ ఇసుక ధ‌ర‌ల‌ను అమ‌లుకు సూత్ర‌ప్రాయంగా సూచ‌న‌లు చేయ‌డం,  రవాణా వ్యయం టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90లోపే ఉండేలా చూడాలని  అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశించ‌డం, ఇసుక రిచ్‌ల‌ను గుర్తించ‌డం, లోడింగ్ స్టాక్ యార్డును గుర్తించి అక్క‌డ ఇసుక నింప‌డం, అక్క‌డి నుంచి వినియోగ‌దారుల‌కు అమ్మ‌కం చేయ‌డం వంటి ప‌నుల‌ను ముందుగానే చేసింద‌ట స‌ర్కారు. దీంతో టీడీపీ గొంతులో వెల‌క్కాయ ప‌డ్డ‌ట్లు అయింద‌ట‌..

ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ (యాప్‌) ద్వారా బుక్‌ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్‌ యార్డులోని వాహనంలో లోడ్‌ చేసి ఇస్తారు. లోడింగ్‌ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్‌ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు
తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. 58 స్టాక్‌ యార్డుల్లో ఇసుకను నింపుతున్నది ఏపీఎండీసీ. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్‌ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న వాహనాలతో స్టాక్‌ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు.

ఏపీఎండీసీ ఇప్పటికే రాష్ట్రంలో 58 ప్రాంతాల్లో  ఇసుక స్టాక్‌ యార్డులకు అనువుగా తీర్చిదిద్దింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నదులు లేక‌పోవ‌డంతో ఈ రెండు జిల్లాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. విశాఖపట్నంలోని అగనంపూడి, ముడసర్లోవలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి, లారీల్లో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు.  102 రీచ్‌ల గుర్తించి అక్క‌డి నుంచి స్టాక్ యార్డ్‌ల‌కు త‌ర‌లించే ప‌నులు ముమ్మ‌రం చేయ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకునే ప‌నుల‌ను ముమ్మ‌రం చేశారు. ఇసుక తవ్వే రీచ్‌ల సంఖ్యను దశలవారీగా 303కు పెంచాలని భూగర్భ గనుల శాఖ యోచిస్తుంది.

స్టాక్‌ యార్డుల సంఖ్యను 157కు పెంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. వాస్త‌వానికి తెలంగాణ స‌ర్కారు ట‌న్ను ఇసుక‌ను రూ.400కు ఇస్తుంది. అయితే ఏపీ స‌ర్కారు వ్య‌యం ఎక్కువ అవుతున్నా దాన్ని భ‌రించి ప్ర‌జ‌ల‌కు త‌క్కువ‌కు అంటే రూ.375కే అందించాల‌ని నిర్ణ‌యించింది. ఇసుక‌ను వినియోగదారుల‌కు అందించ‌డానిక  రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రీచ్‌లో ఇసుకను తవ్వి స్టాక్‌ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 అవుతోంది. ఒక్కో స్టాక్‌ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది.

టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్‌టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్‌ ఫండ్‌(డీఎంఎఫ్‌) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్‌ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులు ఉంటుండంతో అవి ప్ర‌జా సంక్షేమంకు ఉప‌యోగిస్తారు. అయితే రూ.16.38కోట్లు ఇస్తే సీసీ కెమెరాలు, కంప్యూట‌ర్లు, ఫైబ‌ర్ నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించుకుంటామ‌ని ఏపీఎండీసీ ప్ర‌భుత్వాన్ని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news