ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579, , అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులు ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ… కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని స్పష్టం చేసింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.