బ్రేకింగ్ : ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు స్వయంగా గ‌చ్చిబౌలి లోని ఆయన చేరిన ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 15 వ తేదీన పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్‌ తేలిందని వైద్యులు వెల్లడించారు.

Illness for governor bishvabooshan

ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉందని వైద్యులు ప్రకటించారు. గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ కు అస్వస్థత కు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారని వైద్యులు తెలిపారు. న్యూ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన కుటుంబ సభ్యులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారని… వైద్యులు స్పష్టం చేశారు. అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.