100 కు 97 మార్కులు వేశారు : మున్సిపల్ ఫలితాలపై జగన్ ట్వీట్

ఇవాళ వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ పార్టీ దూసుకు పోయిన సంగతి తెలిసిందే. కొండపల్లి మున్సిపల్‌, దర్శి మినహా.. అన్ని మున్నిపాలిటీలను కైవసం చేసుకుంది వైసీపీ పార్టీ. అయితే..ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి 97 మార్కులు వేశారన్నారు సీఎం జగన్.

jagan
jagan

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని స్పష్టం చేశారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిందని కొనియాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100 కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. తమ పై ఏపీ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని అలాగే ముందుకు సాగిస్తామని స్పష్టం చేశారు జగన్‌.కాగా… చంద్రబాబు ఇలాక అయిన కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం.