బందరు పోర్టు డీపీఆర్ కి ప్రభుత్వం ఆమోదం.. కీలక ఉత్తర్వులు జారీ !

-

బందరు పోర్టు డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు ఆమోదం లభించింది. దీంతో పోర్టు అభివృద్ధికి పరిపాలన అనుమతులు లభించినట్లయింది. 5835 కోట్లతో డిపిఆర్ ని ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే పోర్టు నిర్మాణం కోసం ఇంకా సేకరించాల్సిన 225 ఎకరాలకు గాను 90 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అలానే 4745 రూపాయల కోట్ల రూపాయలను రుణాల రూపంలో సమీకరించుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు కు అనుమతి జారీ చేసింది.

 

అంతే కాక ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు పిలిచేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇక ఈ బందరు పోర్టు అభివృద్ధి కి వెయ్యి కోట్ల మేర నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. నిజానికి మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలోనే బందరు పోర్టు నిర్మాణంపై రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టుపై వచ్చిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను మంత్రి వర్గం పరిశీలించి ఈ పోర్టు నిర్మాణానికి 5 వేల 700 కోట్ల రూపాయల వ్యయం కాగలదన్న డీపీఆర్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించింది.

Read more RELATED
Recommended to you

Latest news