అధికార పక్ష నేతల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎట్టకేలకు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. గతంలో సీఎంగా ఉండగా ఆయన అధికారిక నివాసంగా ఉన్న ఉండవల్లి నివాసంలోనే ఆయన బస చేశారు. ఆయన ప్రస్తుతానికి ఎందుకు వచ్చారు అనే అంశం మీద క్లారిటీ లేకున్నా ఆయన మరి కొద్ది రోజుల పాటు అక్కడే ఉండనున్నారని చెబుతున్నారు. అయితే అధికారపక్షం పొద్దున లేస్తే విమర్శించే ఒకే ఒక్క మాట కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్లో దాక్కున్నాడు అని.
మరి ఆ విమర్శలను తిప్పికొట్టడానికి రంగంలో దిగాలని ఆయన ఫిక్స్ అయ్యారో లేక మరే ఇతర కారణాలు ఉన్నాయి తెలీదుగానీ ఆయన అయితే ప్రస్తుతం కరకట్ట మీద ఉన్న ఉండవల్లి నివాసంలో బస చేశారు. ఇక ఈరోజు ఉదయం కూడా చంద్రబాబుని తీవ్రంగా విమర్శిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆయన ఇంట్లో దాక్కోవడం ద్వారా కరోనా నుండి తనని తాను రక్షించుకున్నాడని ఆయన పేర్కొన్నారు.