ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కూడా ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడిండ్ లేదా మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇంతకుముందే పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.