ప్రైవేటు కోవిడ్ సెంటర్ల మీద ఏపీ సర్కార్ వేటు..

-

రమేష్ హాస్పిటల్ కి చెందిన స్వర్ణా ప్యాలెస్ ప్రైవేటు కోవిడ్ సెంటర్ ప్రమాదంతో ఏపీ సర్కార్ అప్రమత్తం అయింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు కోవిడ్ సెంటర్ల మీద రైడ్స్ చేసిన ప్రభుత్వం, నిబంధనలకి అనుగుణంగా లేని కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేసింది. ఒక్క విజయవాడలో 5 కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దయ్యాయి. రమేష్ హాస్పిటల్స్ సహా నాలుగు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వేటు వేసినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతానికి రద్దు చేసిన ప్రైవేటు కోవిడ్ సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ హైట్స్ – రమేష్ హాస్పిటల్స్, హోటల్ అక్షయ – లక్ష్మీ నర్సింగ్ హోం, హోటల్ ఐరా – ఇండో బ్రిటీష్ హాస్పిటల్, సన్ సిటీ, కృష్ణ మార్గ్ – ఎన్ ఆర్ఐ హీలింగ్ హ్యాండ్స్ లకు అనుమతులు రద్దు చేశారు. ఇక రమేష్ హాస్పిటల్ కేసులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలు వచ్చే దాక రమేష్ బాబు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news