చెరకు రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త

-

రానున్న దసరా కు చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఏపీ మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ అంశాలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమైంది. ఈ సమావేశానికి కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది.

ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమైన తర్వాత చెరకు పంట కు చెందిన అన్నింటిపై స్పష్టత తీసుకురావాలన్న యోచనలో ఉన్నారు మంత్రులు. ఈ ఏడాదికి గానూ చోడవరం, తాండవ సహా పలు చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిల మొత్తం రూ.70 కోట్లని వెల్లడించారు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.

ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల బకాయిల విలువే అత్యధికమని.. ఇప్పటికే రూ.72 కోట్లు చెల్లించినట్లు మంత్రులకు వివరించారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య. హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి. చక్కెర ధర పెరిగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అమ్మకాల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. చక్కెర అమ్మకాల మొత్తంలో రైతులకు చెల్లించటమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. తర్వాత ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news