వారికి ఏపీ సర్కార్ శుభవార్త.. అంతా ఆన్ లైన్ లోనే !

-

ఏపీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలకు ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్ ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే జరగనున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణపు ప్లాన్ సులభంగా పొందేలా వీటిని సరళీకరించారు. నిర్మాణరంగానికి ఊతమిచ్చేలా నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. మరింత వేగంగా భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ చేయనున్నారు.

 

అలానే ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు 400 శాతం టిడిఆర్ వర్తింపచేయనున్నారు. అలానే ఇకపై ఆన్ లైన్ లోనే టిడిఆర్ ల జారీ ఉండనుంది. పరిశ్రమల అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాల నిబంధనల్లో కూడా సడలింపులు ఇచ్చారు. అనధికార ప్లాట్లు, భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు కూడా బంద్ కానున్నాయి. ప్రతి దరఖాస్తు దారు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అలానే ఇక నుండి తనీఖీలు పకడ్బందీగా ఉండనున్నాయి. ఈ మేరకు బిల్డింగ్ రూల్స్, లే అవుట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news