అమరావతి : నకిలీ చలనాల స్కాం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నకిలీ చలనాల స్కాము లో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. డబ్బులు రికవరి కాని ఆస్తుల పై రి మార్కులు చూపెట్టాలని భావిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెండింగులో ఉన్నాయంటూ రికవరీ కాని ఆస్తులను ఎంకబెరెన్సులో చూపెడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ. 8 కోట్లకి పైగా నిధులు గోల్ మాల్ అయినట్టు వెల్లడించింది సర్కార్. ఇక ఈ కేసు లో ఇప్పటి వరకు సుమారు రూ. 5 కోట్ల మేర రికవరీ అయినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ నకిలీ చలనాల స్కాం కేసు లో ఏకంగా 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్లు ప్రకటన చేసింది. ఇంకా ఈ స్కాం లో ఎవరు ఉన్న విడిచేది లేదని పేర్కొంది.