అవును ఏపీ సర్కార్ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించిన టీచర్లుకు షాక్ ఇచ్చింది. నిజానికి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించిన టీచర్లుకు రిటైరయ్యాక సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేస్తూ ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018లో జారీ చేసిన ఏడాది సర్వీసు పొడిగింపు జీవో no. 101ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉద్యోగ విరమణ తర్వాత కూడా మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటే సర్వీసు పొడిగించాలన్న నిబంధనల అమలుకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ జీవో అమలును నిలిపివేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జారీ అయిన ఉత్తర్వులకు ఆర్ధిక శాఖ అనుమతి లేకపోవడంతో పాటు న్యాయ పరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందునే ఈ నిలిపివేత ఉత్తర్వులు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.