దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మొదలయింది. కోవిడ్ నేపధ్యంలో ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి కట్టుదిట్టంగా చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణకు 5, 000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 1000 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున కేటాయించారు. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల మోహరించారు అధికారులు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.
ప్రధాన పార్టీలతో పాటు బరిలో ఇరవై మంది అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలయిన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు చివరి గంట లో ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు. 7 గంటలకు తొగుట లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వోటు హక్కు వినియోగించుకోగా చిట్టాపూర్ లో టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత వోటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక మండలం బొప్పాపూర్ లో 8 గంటలకు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘు నందన్ రావు వోటు హక్కు వినియోగించుకోనున్నారు.