బీహార్లో ఇవ్వాళ రెండో దశ పోలింగ్ జరుగనుంది. ఈ రెండో దశలో మొత్తం 94 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్లో రెండు దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం మొదలయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని ఓటర్లకు సూచించింది ఈసీ.
అలానే అన్ని కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఈరోజు బీహార్ అసెంబ్లీలో కీలక పాత్ర పోషించే పాట్నా, భగల్పూర్, నలంద జిల్లాల్లో సహా పలు జిల్లాలో ఈరోజు పోలింగ్ జరగనుంది. మొత్తం 18,823 పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 1500 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 1316 మంది పురుషులు కాగా 146 మంది మహిళలు ఉన్నారు. ఇక మిగిలిన 78 నియోజకవర్గాలకు నవంబరు 7న పోలింగ్ జరుగనుంది. అలానే ఈ మూడు దశలల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరుగుతుంది.