ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అంత్యక్రియల కోసం రూ. 10,000 ఇస్తామని సర్కార్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమ సంస్థ గరుడ సహాయ పథకం కింద రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన మృతుల వివరాలను http://www.andhrabramhim.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరచాలని పేర్కొంది.
అయితే ఈ పథకానికి అర్హులు గా ఉండాలంటే కొన్ని కండిషన్స్ ను కూడా పెట్టింది. వార్షిక ఆదాయం 75 వేల లోపు ఉండాలని అదేవిధంగా… వ్యక్తి మరణించిన 40 రోజుల లోపే దరఖాస్తు చేసుకోవాలని కండిషన్ పెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద బ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. అంత్యక్రియల సమయంలో పేద బ్రాహ్మణులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ పథకం ద్వారా వారికి ఊరట కలిగించే అవకాశం ఉంది.