హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పద్మశాలి ఓట్లు అడిగే అర్హత, హక్కు లేదని టీఆర్‌ఎస్ నేత ఎల్ రమణ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ పట్టణంలో ని టీఆరెఎస్ కార్యాలయం లో టీఆర్‌ఎస్ నేత ఎల్ రమణ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ… కేంద్రం లో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత పరిశ్రమ నిధులు తగ్గించారని… దేశం లో హాండ్లుమ్ బోర్డ్ ను బిజెపి రద్దు చేసిందని ఫైర్ అయ్యారు. చేనేత పరిశ్రమ భీమా లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్ర పరిశ్రమ ముందు దోషిగా నిలబడిందని నిప్పులు చెరిగారు. చేనేత వస్త్రలపై నూలు పై జీఏస్టి విధించిందని ఆగ్రహించారు. చేనేత కార్మికులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని ఆగ్రహించారు ఎల్ రమణ. బతుకమ్మ చిరలతో చేనేత పరిశ్రమను ఆదుకున్నది టీఆరెఎస్ ప్రభుత్వమని కొనియాడారు ఎల్ రమణ..