వందేళ్ల తర్వాత ఏపీలో మళ్లీ సమగ్ర భూ సర్వే జరుగనుంది. మూడు విడతలుగా జరుగున్న ఈ సర్వే కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ఇక ఈ వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కోళ్ళపాటు గ్రామంలో సీఎం సర్వే ప్రారంభించనున్నారు. 2023 ఆగష్టు నాటికి రాష్ట్ర వ్యాప్త సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి విడతలో ఐదువేల గ్రామాలు, రెండో విడతలో 6500, మూడవ విడతలో 5500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. రెండు కోట్ల 26 లక్షల వ్యవసాయ భూములల్లో సర్వే చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో సుమారు మూడు వేల 346 చదరపు కిలోమీటర్లలో సర్వే జరుగుతుంది. సర్వే పూర్తైన తర్వాత భూ హద్దులు నిర్ణయించి సర్వే రాళ్ళను ప్రభుత్వ ఖర్చుతోనే పెట్టి భూ యజమానికి ల్యాండ్ మ్యాప్, ల్యాండ్ టైటిల్ కార్డ్ ఇస్తారు.