కొలువులే.. కొలువులు..

-

కరోనా దెబ్బకు ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుద్యోగుల ఆశలు మెల్లిగా చిగురిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఆ అధికార ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేట్, గంథాలయాల్లో కొత్త కొత్త పుస్తకాల వేట కొనసాగిస్తున్నారు. తాము ఉండటానికి ఇప్పటి నుంచే హాస్టళ్ల వివరాలు, బంధువుల ఇళ్లపై ఆరా తీస్తున్నారు.

గ్రామీణ పట్టణాల నుంచి..

హైదరాబాద్‌లో, అన్ని ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య ప్రాంతాలైన దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని శిక్షణ కేంద్రాలకు వరస కడుతున్నారు. వివిధ పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తమ పేరు, చిరునామా ముందస్తుగా ఇస్తున్నారని పలువురు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల పూర్తి వివరాలు త్వరితగతిని ప్రభుత్వానికి చేరితే 2–3 నెలల్లో ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక్ష తరగతులపైనే..

ఇప్పటికే కొన్ని కేంద్రాలు ఆన్‌లైన్‌లో శిక్షణ కొనసాగిస్తున్నాయి. కానీ.. ఆన్‌లైన్‌ కన్నా ప్రత్యేక్ష తరగతులకే అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవేళ ప్రత్యేక్ష తరగతులు ప్రారంభమైతే భౌతికదూరం, కోవిడ్‌–19 నియమాలు పాటించాల్సి అవసరం ఎంతైనా ఉందని∙అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చెయాల్సిందేనని ఓ శిక్షణ కేంద్రం నిర్వాహకుడు తెలిపారు.

చిగురించిన ఆశలు..

వెంటవెంటనే ఉద్యోగాల ప్రకటనలు వెలువడితేనే నిరుద్యోగులతో పాటు తమ జీవితాలు కూడా బాగుంటాయని పుస్తకాల విక్రయాదారులు అంటున్నారు. కరోనా దెబ్బకు నష్టాల బాటలో నడుస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన వినగానే మళ్లీ ఆశ చిగురించిందని.. ఇకపై తామ దుకాణాలు సర్దుకొని పుస్తకాల ప్రింటింగ్‌పై దృష్టి పెడతామంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news