ఏపీ ప్రభుత్వం మీద హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు..మందుబాబులకి థాంక్స్ చెప్పండి !

-

మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై ఏపీ హైకోర్ట్ లో ఈరోజు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా..? అని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్.

కరోనా సమయంలో అత్యధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమం కోసం పాటుప డిన మందుబాబులు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని ధర్మాసనం వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.  దేశంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా మీరెంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించింది ధర్మాసనం. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ఆస్తుల అమ్మకాన్నినివారించాలని హైకోర్ట్ లో 10 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news