కాదన్న వ్యక్తి మళ్ళీ వచ్చాడనే…. ఏపీ సర్కార్ మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఏపీ ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు నివహించేందుకు ప్రభుత్వం తనకు సహకరించడం లేదని ప్రభుత్వం మీద ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వేసిన పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆరోపించిన విధంగానే ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల కమిషన్ చేస్తున్న అన్ని వినతుల మీద ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని హైకోర్టు పేర్కొంది.

తాము తొలగించిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడంతో ప్రభుత్వం నాన్ కోపరేటివ్ గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వాలు మారాయి కానీ రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయని ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. రాజ్యాంగ సంస్థల కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే ప్రభుత్వానికి మూడు రోజుల్లో సవివర వినతిపత్రం సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది హైకోర్టు. అలానే ప్రభుత్వం కూడా నివేదిక రూపంలో తమకు పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది

Read more RELATED
Recommended to you

Latest news