కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరు నగరంలో మెగాస్టార్ చిరంజీవిపై కేసు నమోదైంది. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఓ రాజకీయ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ కేసు పెట్టారు. నిర్ణీత టైంలోపు మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని ఆయనపై కేసు నమోదు అయింది.
చిరంజీవి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ ఈ కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఇక, సినిమాల్లో మెగస్టార్‌గా ఎదిగిన చిరు.. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్న మెగాస్టార్.. పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.